భార్యను నగ్నంగా చూశాడని, ఆరేళ్ల చిన్నారిని హత్య చేసిన దుర్మార్గుడు!
- దేశ రాజధానిలో కలకలం రేపిన ఘటన
- బాత్ రూమ్ లోకి వచ్చాడని పక్కింటి బాలుడి హత్య
- పోలీసుల విచారణలో నిజం కక్కిన వ్యక్తి
గత నెల 27వ తేదీ నుంచి తమ బిడ్డ కనిపించడం లేదని పక్కింటి ఓ కుటుంబం నుంచి అందిన ఫిర్యాదులో భాగంగా పోలీసులు విచారించగా, బాలుడిని రోహిత్ హత్య చేశాడని తేలింది. తన భార్యను నగ్నంగా చూశాడని, ఆపై పిచ్చి మాటలు మాట్లాడాడన్న ఆగ్రహంతో అతన్ని చంపేసినట్టు రోహిత్ విచారణలో అంగీకరించాడు. బాలుడిని చంపిన తరువాత బాక్స్ బెడ్ లో మృతదేహాన్ని దాచిన రోహిత్, పరారై, సెల్ ఫోన్ ను స్విచ్చాఫ్ చేసుకున్నాడు. రోహిత్ పై అనుమానంతో నిఘా పెట్టిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి నిజం కక్కించినట్టు డీసీపీ రోమిల్ బానియా వెల్లడించారు.