donald trump: ట్రంప్ పర్యటనలో ఇండియా లేదట!

  • పలు ఆసియా దేశాల్లో పర్యటించనున్న ట్రంప్
  • ఇండియాకు రావడం లేదని శ్వేతసౌధం వెల్లడి
  • మనీలాలో ట్రంప్, మోదీ భేటీ అయ్యే అవకాశం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలిసారి ఆసియా దేశాల పర్యటనకు వస్తున్నారు. అయితే, భారత్ ఆశలపై మాత్రం ఆయన నీళ్లు చల్లారు. వైట్ హౌస్ ఈరోజు ప్రకటించిన జాబితాలో ఇండియా పేరు లేదు. చైనా, జపాన్, వియత్నాం, దక్షిణ కొరియా, ఫిలిప్పీన్స్, హవాయి దేశాల్లో ట్రంప్ పర్యటన కొనసాగుతుందని వైట్ హౌస్ తెలిపింది. నవంబర్ 3వ తేదీ నుంచి నవంబర్ 14 వరకు ట్రంప్ పర్యటన కొనసాగనుంది. అయితే, ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో జరగనున్న ప్రాంతీయ సదస్సులో మాత్రం మన ప్రధాని మోదీతో ట్రంప్ భేటీ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే దీనిపై ఇంతవరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. 
donald trump
narendra modi
trump asia tour

More Telugu News