ap film development corporation: ఏపీలో ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు.. ప్రారంభించిన బాలయ్య

  • విజయవాడలో కార్యాలయం ఏర్పాటు
  • కార్యాలయాన్ని ప్రారంభించిన నందమూరి బాలకృష్ణ
  • కార్పొరేషన్ ఛైర్మన్ గా అంబికా కృష్ణ
ఆంధ్రప్రదేశ్ లో ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఏర్పాటయింది. విజయవాడలో కార్పొరేషన్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర విభజన జరిగిన మూడున్నర ఏళ్ల తర్వాత ఏర్పాటైన ఈ కార్పొరేషన్ కార్యాలయాన్ని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రారంభించారు. కార్పొరేషన్ ఛైర్మన్ గా అంబికా కృష్ణ నియమితులయ్యారు.

ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ, ఇరు రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి ఏం చేయాలో ఆలోచిస్తామని చెప్పారు. ఏపీలో సినిమా షూటింగ్ లకు అనువైన ఎన్నో ప్రాంతాలు, సముద్రం, వసతులు అన్నీ ఉన్నాయని చెప్పారు. అంబికా కృష్ణ మాట్లాడుతూ, విజయదశమి రోజున బాలయ్య చేతుల మీదుగా ఈ కార్యాలయాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఏపీలో కూడా చిత్ర రంగాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. బాలయ్య సలహాలను తీసుకుంటూ ముందుకు సాగుతామని తెలిపారు. 
ap film development corporation
balakrishna
ambika krishna

More Telugu News