pakistan: హఫీజ్ సయీద్ పార్టీని నిషేధించాలంటూ ఎన్నికల సంఘానికి పాక్ ఆదేశం!

  • హఫీజ్ సయీద్ కు పాక్ ప్రభుత్వం షాక్  
  • ఈ నెల 22న పాక్ జాతీయ ఎన్నికల కమిషన్ కు లేఖ రాసిన పాక్ అంతర్గత వ్యవహారాల శాఖ
రాజకీయ పార్టీని స్థాపించిన ఉగ్ర సంస్థ లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్‌ కు పాకిస్తాన్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. మిల్లీ ముస్లిం లీగ్స్ (ఎంఎంఎల్) పేరిట రాజకీయ పార్టీని నెలకొల్పి, నమోదు కోసం ఎన్నికల సంఘానికి హఫీజ్ దరఖాస్తు కూడా చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో ఈ పార్టీని నిషేధించాలని ఎన్నికల సంఘాన్ని పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల శాఖ ఆదేశించింది. ఆ పార్టీ చేసుకున్న దరఖాస్తును తిరస్కరించాలని సూచించింది. కాగా, హఫీజ్ సయీద్ పాక్ లో ప్రస్తుతం గృహనిర్బంధంలో ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు ఈ నెల 17న లాహోర్‌ లో జరిగిన ఉపఎన్నికల్లో ఎంఎంఎల్ పార్టీకి 5 శాతం ఓట్లు రావడం విశేషం. 
pakistan
hafeej saeed
lashare toiba
mml party

More Telugu News