raviteja: దసరా రోజున 'దీపావళి' శుభాకాంక్షలు చెప్పిన రవితేజ.. అలరిస్తున్న వీడియో!

  • వీడియోతో వినూత్నంగా దసరా శుభాకాంక్షలు చెప్పిన 'రాజా ద్రి గ్రేట్‌' నటులు
  • రవితేజ, రాజేంద్ర ప్రసాద్ మధ్య మాటల చమక్కులు 

దసరా పండుగను పురస్కరించుకుని ప్రముఖ నటుడు రవితేజ అందరికీ వినూత్నంగా శుభాకాంక్షలు చెప్పాడు. 'రాజా ద్రి గ్రేట్‌' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న రవితేజ ఈ సినిమాలో నటిస్తున్న సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్, హీరోయిన్ మెహరీన్, హాస్యనటుడు శ్రీనివాసరెడ్డిలతో కలిసి శుభాకాంక్షలు చెప్పిన వీడియోను దర్శకుడు అనిల్ రావిపూడి తన సోషల్ మీడియా ఖాతా ద్వారా విడుదల చేశారు.

ఆ వీడియోలో 'అందరికీ దసరా శుభాకాంక్షలు' అని రాజేంద్రప్రసాద్‌ చెబుతుండగా 'దీపావళి శుభాకాంక్ష'లంటూ రవితేజ అంటాడు. 'నేను దసరా శుభాకాంక్షలు చెబితే వీడు దీపావళి అంటాడేమిటి' అని రాజేంద్ర ప్రసాద్‌ ప్రశ్నించగా, 'మన సినిమా రిలీజ్‌ అయ్యేది దీపావళికేగా' అంటాడు రవితేజ.

'అప్పుడు ముందు దసరాకు చెప్పి తర్వాత దీపావళి చెప్పొచ్చుగా' అని రాజేంద్రప్రసాద్‌ అంటాడు. ఇలా వినూత్నంగా ఆకట్టుకునేలా ఈ వీడియోను దర్శకుడు రూపొందించి టీజర్ లా విడుదల చేశాడు. ఇది అభిమానులను ఆకట్టుకుంటోంది. దానిని మీరు కూడా చూడండి. 

raviteja
mehreen
rajendraprasad
srinivasareddy
raja the great
  • Loading...

More Telugu News