Tom Alter: ప్రముఖ నటుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత టామ్ అల్టెర్ కన్నుమూత

షార్ట్స్‌లో చూడండి
సినిమా, టెలివిజన్, థియేటర్ లకు చెందిన సీనియర్ నటుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత టామ్ అల్టెర్ (67) కన్నుమూశారు. స్టేట్- ఫోర్ చర్మ కేన్సర్‌తో బాధపడుతున్న ఆయన శుక్రవారం రాత్రి తన నివాసంలోనే కన్నుమూశారు. 1980లలో స్పోర్ట్స్ జర్నలిస్టుగానూ పనిచేసిన ఆయన మూడు పుస్తకాలు కూడా రాశారు. 300కుపైగా సినిమాల్లో నటించారు. పలు టీవీ షోలలోనూ నటించిన ఆయన దర్శకత్వంలోనూ ప్రతిభ చాటారు. టీవీ కోసం సచిన్ టెండూల్కర్‌ను తొలిసారి ఇంటర్వ్యూ చేసింది టామ్‌నే. 2008లో ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ పౌర పురస్కారంతో గౌరవించింది.

టామ్ మరణంతో తమ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయిందని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. భారత్‌లో థర్డ్ జనరేషన్ అమెరికన్ అయిన టామ్ 1950లో హిల్ స్టేషన్‌ అయిన ముస్సోరీలో జన్మించారు. పుణెలోని ప్రఖ్యాత ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్‌లో చేరి గోల్డ్ మెడల్ సంపాదించారు. టామ్‌కు భార్య కరోల్, కుమారుడు జామీ, కుమార్తె అఫ్షాన్ ఉన్నారు.
Go Back to Shorts
Tom Alter
Padma Shri
dies

More Telugu News