నల్గొండ ఉపఎన్నిక: ఒకవేళ నల్గొండ ఉపఎన్నిక వస్తే టీఆర్ఎస్ దే విజయం : సీఎం కేసీఆర్
- ఎంపీ గుత్తా రాజీనామాపై స్పందించిన కేసీఆర్
- ఉపఎన్నిక వస్తుందో, రాదో తనకు తెలియదన్న ముఖ్యమంత్రి
నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గానికి త్వరలోనే ఉపఎన్నిక జరగనుందనే విషయమై జోరుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి రాజీనామా అంశంపై సీఎం కేసీఆర్ స్పందించారు. నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గానికి ఉపఎన్నిక వస్తుందో, రాదో తనకు తెలియదని, ఒకవేళ వస్తే, టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
కాగా, గుత్తా సుఖేందర్ రెడ్డి తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తారని, దాంతో ఉపఎన్నిక వస్తుందనే వార్తలు మీడియాలో హల్ చల్ చేస్తున్న తరుణంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.