రావెల: రావెల మానసికస్థితి సరిగా లేకనే ఏదేదో మాట్లాడుతున్నారు: ఏపీ మంత్రి జవహర్

  • రావెల తీరు క్రమశిక్షణారాహిత్యం కిందకు వస్తుంది
  • మాదిగ వర్గానికి రాజకీయ ప్రాధాన్యమిచ్చింది టీడీపీనే అన్న జవహర్
టీడీపీలో ఉండి పార్టీ అధినేతపైనే వ్యాఖ్యలు చేయడం సబబు కాదని, ఆ విధంగా ప్రవర్తించడం క్రమశిక్షణారాహిత్యం కిందకు వస్తుందంటూ ఎమ్మెల్యే రావెల కిషోర్ బాబుపై ఏపీ మంత్రి జవహర్ మండిపడ్డారు. మంత్రి పదవి పోవడంతో మానసిక ఒత్తిడికి గురైన రావెల, ఏదేదో మాట్లాడుతున్నారని, మాదిగ వర్గానికి రాజకీయ ప్రాధాన్యం కల్పించింది టీడీపీనే అన్న విషయం ఆయన మరిచిపోయినట్టున్నారని విమర్శించారు.

మాదిగలకు, టీడీపీకి ఉన్న బంధాన్ని విడదీయాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ యత్నిస్తున్నారని ఆరోపించారు. ‘వర్గీకరణ’పై ఢిల్లీలో పోరాడదామంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటనపై ఆయన్ని మంద కృష్ణ ఎందుకు నిలదీయడం లేదని ఈ సందర్భంగా జవహర్ ప్రశ్నించారు.
రావెల
మంత్రి జవహర్

More Telugu News