క్రికెట్: నిన్నటి వన్డేలో వేడ్ విసిరిన బంతి రోహిత్ శర్మకు బలంగా తాకినప్పటి వీడియో!
- అనుకోకుండా విసిరానని వేడ్ క్షమాపణలు
- వేడ్‌పై మండిపడుతున్న టీమిండియా అభిమానులు
నిన్న జరిగిన నాలుగో వన్డేలో ఆసీస్ కీపర్ వేడ్ విసిరిన బంతి టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మకు తాకింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. 16.5వ ఓవర్లో హెడ్ వేసిన బంతికి రోహిత్ ఒక పరుగు రాబట్టాడు. అయితే, ఆ బాల్‌ను పట్టుకున్న డేవిడ్ వార్నర్ దాన్ని కీపర్ వేడ్‌కి అందించాడు. ఆ బాల్‌ని వేడ్.. హెడ్‌కి ఇచ్చేందుకు విసిరాడు.
అది నేరుగా వెళ్లి రోహిత్ శర్మ హెల్మెట్‌కి తాకింది. హెల్మెట్ ఉండడంతో రోహిత్ శర్మకు గాయం కాలేదు. దాంతో, అనుకోకుండా విసిరానని వేడ్ క్షమాపణలు చెప్పాడు. అయితే, టీమిండియా అభిమానులు మాత్రం వేడ్‌పై మండిపడుతున్నారు. ఉద్దేశపూర్వకంగానే ఇలా చేశాడని అంటున్నారు.