visakhapatanam: ముందుగా తమ్ముడికి పెళ్లి చేస్తున్నందుకు కక్షతో అన్న ఘాతుకం!

  • మద్యం వ్యసనానికి బానిసైన పెద్ద కొడుకు శ్రీనుబాబు
  • వ్యసనాలు మానాలన్న కుటుంబ సభ్యులపై కక్ష
  • తల్లి, తమ్ముడిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన శ్రీనుబాబు
తమ్ముడికి పెళ్లి కుదిరిందన్న కక్షతో కుటుంబాన్ని అంతమొందించాలని ఒక అన్న ప్రయత్నించిన ఘటన విశాఖపట్టణం జిల్లాలో చోటుచేసుకుంది. మాడుగుల మండలం చదురుమామిడికి చెందిన పోతురాజు, తిమ్మప్ప దంపతులకు శ్రీనుబాబు, చంటిబాబు అనే ఇద్దరు పిల్లలున్నారు. శ్రీనుబాబు తాగుబోతై జులాయిగా తిరుగుతుండగా, చంటిబాబు బాధ్యతగా మసలుకుంటున్నాడు.

ఈ నేపథ్యంలో వ్యసనాలు మానేయాలంటూ కుటుంబ సభ్యులు శ్రీనుబాబుపై ఒత్తిడి తెచ్చేవారు. ఈ క్రమంలో చంటిబాబుకు వివాహం నిశ్చయమైంది. పెద్దవాడైన తనకు వివాహం చేయకుండా చిన్నవాడికి సంబంధం కుదర్చడంతో కక్ష పెంచుకున్న శ్రీనుబాబు, ఇంట్లో నిద్రిస్తున్న తల్లి, తమ్ముడిపై పెట్రోలు పోసి నిప్పంటించాడు. వారిద్దరూ తీవ్రంగా గాయపడడంతో వారిని చికిత్స నిమిత్తం స్థానికులు ఆసుపత్రికి తరలించారు. 
visakhapatanam
madugula
murder trail

More Telugu News