ben stokes: బెన్ స్టోక్స్ వీడియో వైరల్... నిమిషంలో 15 పిడిగుద్దులు.. వీడియోపై ఓ లుక్కేయండి!

  • నైట్ క్లబ్ బయట బెన్ స్టోక్స్ ఘర్షణ
  • తోడుగా సహ క్రికెటర్ హెల్స్ 
  • సోషల్ మీడియాలో వైరల్ వీడియో
బ్రిస్టల్‌ లోని నైట్‌ క్లబ్‌  వెలుపల ఇంగ్లండ్ క్రికెటర్ బెన్ స్టోక్స్ ఓ వ్యక్తిపై దాడి చేసి గాయపరిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బెన్ స్టోక్స్ అరెస్టు కూడా అయ్యాడు. అనంతరం పోలీసులు అతనిని హెచ్చరించి వదిలేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిమిషంలో 15 పిడిగుద్దులు కురిపించాడంటూ అభిమానులు పేర్కొంటున్నారు. ఈ వీడియో బెన్ స్టోక్స్ దూకుడుని బట్టబయలు చేస్తోంది. ఈ ఘటన జరుగుతున్నప్పుడు మరో క్రికెటర్ హేల్స్ కూడా అక్కడే ఉన్నాడు. ఒక దశలో స్టోక్స్ ను అడ్డుకునే ప్రయత్నం కూడా చేశాడు. అయితే ఒక దశలో హెల్స్ కూడా ఒకరిపై చేయిచేసుకోవడంతో వీరిద్దరినీ ఒక వన్డేకు దూరం చేస్తూ ఇంగ్లండ్‌ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ వీడియోను మీరు కూడా చూడండి.

ben stokes
hales
England
cricketer

More Telugu News