spyder: ఓవర్సీస్ లో కుమ్మేసిన 'స్పైడర్'.. తొలి రోజు కలెక్షన్లు ఇవే!

  • తొలి రోజు భారీ వసూళ్లను సాధించిన 'స్పైడర్'
  • ఓవర్సీస్ లో సూపర్ కలెక్షన్స్
  • క్లాస్ ఆడియెన్స్ నుంచి భారీ స్పందన
సూపర్ స్టార్ మహేష్ బాబు, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన 'స్పైడర్' మూవీ తొలిరోజు భారీ కలెక్షన్లను సాధించింది. తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ చిత్రం క్లాస్ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఓవర్సీస్ లో ఈ సినిమాకు భారీ ఆదరణ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా తొలిరోజు రూ. 38 కోట్ల కలెక్షన్లను సాధించింది. ఓవర్సీస్ లో మహేష్ బాబుకు ఉన్న క్రేజ్ దీనికి కారణమని సినీ విశ్లేషకుడు ఉమైర్ సంధు తెలిపాడు. మహేష్ బాబు కెరీర్లో ఓవర్సీస్ లో ఇప్పటి వరకు హయ్యెస్ట్ గ్రాసర్ గా 'శ్రీమంతుడు' నిలిచింది. ఆ సినిమా రికార్డును 'స్పైడర్' దాటుతుందా? లేదా? అనేది వేచి చూడాలి.
spyder
spyder movie
spyder first day collections
tollywood
mahesh babu
murugadoss
rakul preet singh

More Telugu News