anushka: నాగార్జునతో తొలి సినిమా సమయంలో.. ఇంటికెళ్లి ఏడ్చేశా: అనుష్క

  • కొత్తలో ఎవరికైనా తడబాటు ఉంటుంది
  • ఓ పాటలో స్టెప్స్ వేయడానికి తడబడ్డా
  • అందరూ నా వైపు జాలిగా చూశారు
  • ఏడుపొచ్చేసింది
కొత్తగా సినిమాల్లోకి వచ్చిన ఆర్టిస్టులకు తడబాటు ఉంటుందని... వచ్చీ రాగానే ఎవరూ సింగిల్ టేక్ ఆర్టిస్టులు కాలేరని నటి అనుష్క పేర్కొంది. ఎవరికైనా కొన్ని సందర్భాల్లో టేకుల మీద టేకులు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పింది. తనకు కూడా ఇలాంటి సందర్భమే వచ్చిందని చెప్పిన అనుష్క... తన ఫస్ట్ మూవీ నాగార్జునతో కలసి చేశానని... ఓ పాటలో స్టెప్స్ వేయడానికి చాలా కష్టపడ్డానని తెలిపింది.

 వాస్తవానికి అవి సింపుల్ స్టెప్సేనట. కానీ మూమెంట్స్ ను అర్థం చేసుకోలేక తడబడిందట. పది టేకులు తీసుకున్నా ఉపయోగం లేకపోయిందట. దీంతో, అక్కడున్నవారంతా అనుష్కవైపు జాలిగా చూశారట. ఆ క్షణంలో తనకు ఏడుపొచ్చేసిందని... ఇంటికెళ్లి ఏడ్చేశానని స్వీటీ చెప్పింది. ఎవరైనా తిట్టినా భరిస్తాను కానీ... జాలిగా చూస్తే మాత్రం తట్టుకోలేనని అంది.
anushka
anushka shetty
actress anushka
tollywood
nagarjuna

More Telugu News