tollywood: తెలుగు సినీ పరిశ్రమను విజయవాడకు రప్పిస్తాం: అంబికా కృష్ణ

  • చిన్ని చిత్రాలకు రాయితీలిస్తాం
  • జాషువా జయంతి ఉత్సవాల్లో అంబికా కృష్ణ ప్రకటన
తెలుగు చలనచిత్ర రంగాన్ని హైదరాబాద్ నుంచి విజయవాడకు రప్పించేందుకు అన్ని ప్రయత్నాలను చేస్తున్నామని ఏపీ ఎఫ్డీసీ ఛైర్మన్ అంబికా కృష్ణ పేర్కొన్నారు. చిన్ని చిత్రాలను ఏపీలో తీస్తే, వాటికి ప్రత్యేకమైన రాయితీలను ఇవ్వడం ద్వారా చిత్ర నిర్మాణాన్ని ఏపీకి తీసుకురావాలనుకుంటున్నట్టు తెలిపారు. జాషువా జయంతి ఉత్సవాల్లో భాగంగా గవర్నర్ పేటలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో జాషువా సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అంబికా కృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పై వివరాలను వెల్లడించారు.   
tollywood
telugu film industry
ambika krishna
vijayawada

More Telugu News