పార్థసారధి: మా పార్టీలో చేరేందుకు ఫోన్ చేసిన ప్రజల సంఖ్య 50 లక్షలకు చేరింది: వైసీపీ నేత పార్థసారధి
- నంద్యాలలో డబ్బును పంచడం వల్లే టీడీపీ గెలిచింది
- వైఎస్సార్ కుటుంబ సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతమవుతోంది
- టీడీపీ సర్కారు ఎప్పుడు పోతుందా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు
ఇటీవల నంద్యాలలో జరిగిన ఎన్నికల్లో అధికార బలం ఉపయోగించి, డబ్బును విచ్చలవిడిగా పంచడం వల్లే టీడీపీ గెలుపొందిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత పార్థసారధి వ్యాఖ్యానించారు. ఈ రోజు హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రం మొత్తానికి ప్రకటించాల్సిన అభివృద్ధి కార్యక్రమాలను ఒక్కచోట ప్రకటించారని అన్నారు.
కాగా, తాము చేపట్టిన ‘వైఎస్సార్ కుటుంబ సభ్యత్వ నమోదు కార్యక్రమం’ విజయవంతంగా కొసాగుతోందని చెప్పారు. తమ పార్టీలో చేరేందుకు ఫోన్ చేసిన వారి సంఖ్య 50 లక్షలకు చేరిందని పార్థసారధి అన్నారు. రాజశేఖర్ రెడ్డి హయాంలో పెన్షన్ల విషయంలో ఎవరిపైనా వివక్ష చూపించలేదని, ఇప్పటి ప్రభుత్వం మాత్రం అన్నింట్లోనూ వివక్ష చూపుతోందని విమర్శించారు.
చంద్రబాబు నాయుడు పేదలకు ఒక్క ఇల్లు కూడా కట్టించలేదని, అందుకే టీడీపీ సర్కారు ఎప్పుడు పోతుందా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని ఆయన అన్నారు. అమరావతి పనులు ముందుకు తీసుకుపోకుండా చంద్రబాబు నాయుడు ఆలస్యం చేస్తున్నారని అన్నారు. రాజధాని విషయాన్ని అడ్డుపెట్టుకుని, అమరావతి నిర్మాణం పూర్తవ్వాలంటే మళ్లీ తనకే ఓటు వేయాలని చంద్రబాబు అడుగుతారని అన్నారు.