అమరావతి: అమరావతిలో వరల్డ్ పవర్ బోట్ రేసింగ్ ఛాంపియన్ షిప్

  • వచ్చే ఏడాదిలో బోట్ రేసింగ్ ఛాంపియన్ షిప్
  • పదిరోజుల పాటు నిర్వహించేందుకు ప్రణాళిక
  • ఏర్పాట్లు బాగుండాలని నిర్వాహకులకు సీఎం చంద్రబాబు సూచన

ఏపీలో వచ్చే ఏడాది వరల్డ్ పవర్ బోట్ రేసింగ్ ఛాంపియన్ షిప్ పోటీలు జరగనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. రాజధాని అమరావతిలోని కృష్ణా తీరంలో ఈ పోటీలు నిర్వహించనుంది. పది రోజుల పాటు నిర్వహించనున్న పీ-వన్ వరల్డ్ ఛాంపియన్ షిప్ కు ప్రపంచం నలుమూలల నుంచి క్రీడాకారులు వస్తారని తెలుస్తోంది.

ఈ పోటీల నిర్వహణకు నిర్దిష్ట ప్రణాళికతో నిర్వాహకులు రావాలని సీఎం చంద్రబాబునాయుడు ఈ రోజు నిర్వహించిన సమావేశంలో సూచించారు. ఈ పోటీలను ప్రేక్షకులు తిలకించేందుకు ఏర్పాట్లు బాగా ఉండాలని, ఈ పోటీల్లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు, ఫ్యాషన్ షో, ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా చంద్రబాబు సూచించారు.

  • Loading...

More Telugu News