spaider: 'స్పైడర్' సినిమా సూపర్... ఇలాంటి సినిమా మళ్లీ రాదు... అభిమానుల టాక్!

  • 'స్పైడర్' సూపర్ హిట్
  • శివ అనే ఇంటెలిజెన్స్ అధికారిగా నటించిన మహేష్ బాబు
  • మహేష్ బాబు కెరీర్ లో అద్భుతమైన సినిమా
  • రెండు రోజుల ముందే దసరా వచ్చేసిందంటున్న అభిమానులు
'స్పైడర్' సినిమా సూపర్ హిట్ అని అభిమానులు పేర్కొంటున్నారు. బెనిఫిట్ షో చూసిన అభిమానులు సినిమాపై హర్షం వ్యక్తం చేశారు. 'శివ' అనే ఇంటెలిజెన్స్ అధికారిగా మహేష్ నటించాడని, సెటిల్డ్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడని వారు చెప్పారు. ప్రతి ఒక్కరికీ మానవత్వం ఉండాలని మహేష్ ఈ సినిమాతో సందేశం ఇచ్చాడని వారు చెప్పారు.

మహేష్ బాబు కెరీర్ లో ఇలాంటి సినిమా చేయలేదని వారు తెలిపారు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అని చెప్పారు. తమకు దసరా అప్పుడే వచ్చేసిందని వారు చెప్పారు. మరికొందరు అభిమానులు తాము ఇప్పటికే బెనిఫిట్ షో చూశామని, మళ్లీ మరోసారి సినిమా చూసేందుకు వెళ్తున్నామని తెలిపారు. కాగా, ప్రపంచ వ్యాప్తంగా 2,500 థియేటర్లలో ఈ సినిమా రిలీజైన సంగతి తెలిసిందే. 
spaider
maheshbabu
murugadas
rakul preet singh
spaider movie

More Telugu News