sahid afridi: తనపై తానే జోకేసుకుని నవ్వించిన అఫ్రిది!

  • ఎక్కువ సేపు మాట్లాడనంటూ నవ్వులు పూయించిన షాహిద్ అఫ్రిది 
  • క్రీజులో వుండేది కాసేపే అయినా అఫ్రిది మెరుపులు మెరిపిస్తాడు  
పాకిస్థాన్ దిగ్గజ క్రికెటర్ షాహిద్ అఫ్రిది తన బ్యాటింగ్ శైలిపై తానే జోకేసుకుని నవ్వులు పూయించిన ఘటన చోటుచేసుకుంది. దాని వివరాల్లోకి వెళ్తే... అంతర్జాతీయ క్రికెట్ నుంచి అయిష్టంగా వైదొలగిన షాహిద్ అఫ్రిది తాజాగా పాక్ లో ఒక కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, 'అస్సలామాలైకుమ్, నా బ్యాటింగ్ లాగే మీ సమయాన్ని కూడా ఎక్కువ తీసుకోను' అన్నాడు. దీంతో అక్కడ నవ్వులు పూశాయి.

అఫ్రిది మంచి బ్యాట్స్ మేన్ అయినప్పటికీ, క్రీజులోకి ఇలా వచ్చి అలా వెళ్లిపోతాడన్న పేరుంది. ఉన్న కాసేపు ఫోర్లు, సిక్సర్లతో మెరుపులు మెరిపిస్తాడు. అయితే, అది ఎక్కువ సేపు నిలవదు. అందుకే, తన బ్యాటింగ్ మీద అలా జోకు వేసుకున్నాడు.   
sahid afridi
afridi joke
pak cricketer

More Telugu News