jammu kashmir: అకౌంట్ క్రియేట్ చేసుకున్న మూడేళ్ల‌కి మొద‌టి ట్వీట్ చేసిన జ‌మ్మూ కాశ్మీర్ సీఎం... స్వాగ‌తం ప‌లికిన మాజీ సీఎం!

జ‌మ్మూ కాశ్మీర్ ముఖ్య‌మంత్రి మెహ‌బూబా ముఫ్తీకి అధికారిక‌ ట్విట్ట‌ర్ అకౌంట్ 2014 నుంచి ఉంది. ఆ అకౌంట్‌కి 25 వేల మందికి పైగా ఫాలోవ‌ర్లు కూడా ఉన్నారు. అయిన‌ప్ప‌టికీ ఆమె సోష‌ల్ మీడియాలో పెద్ద‌గా క్రియాశీల‌కంగా ఉండ‌రు. దాదాపు మూడేళ్ల త‌ర్వాత ఇప్పుడు త‌న ట్విట్ట‌ర్ అకౌంట్‌ను ఆమె ఉప‌యోగించుకున్నారు.

ఆదివారం రోజున ఆమె త‌న మొద‌టి ట్వీట్ చేశారు. కాశ్మీర్ టూరిజాన్ని ప్ర‌చారం చేసే ఒక వీడియోను మెహ‌బూబా షేర్ చేశారు. ఆ వీడియోపై జ‌మ్మూ కాశ్మీర్ మాజీ సీఎం ఒమ‌ర్ అబ్దుల్లా కామెంట్ చేశారు. `25వేల మంది ఫాలోవ‌ర్లు వ‌చ్చాక, టూరిజం వీడియో షేర్ చేసి సీఎం నోరు విప్పారు. ట్విట్ట‌ర్‌కి స్వాగ‌తం సీఎం సాహిబా` అని ఆయ‌న ట్వీట్ చేశారు.
jammu kashmir
mehabooba mufti
omar abdulla
twitter

More Telugu News