australia cricket: ఆడటం చేతకాని మీకు.. అంతంత జీతాలు ఎందుకు?: ఆస్ట్రేలియా క్రికెట్ అభిమానుల ఆగ్రహం

  • ప్రదర్శన ఆధారంగానే జీతాలు చెల్లించాలి
  • భార్యలను, భాగస్వాములను టూర్లకు పంపించొద్దు
  • భారత్ లో వైఫల్యంపై మండిపడుతున్న అభిమానులు
భారత్ తో జరుగుతున్న వన్డే సిరీస్ లో తొలి మూడు మ్యాచుల్లో ఘోర ఓటమిపాలైన తమ జట్టుపై ఆస్ట్రేలియా అభిమానులు మండిపడుతున్నారు. జీతాల కోసం ఫైట్ చేస్తారు కానీ... ఆట మాత్రం ఆడలేరా? అంటూ ఎద్దేవా చేశారు. ఏం గొప్పగా ఆడుతున్నారని వీళ్లకు అంతంత జీతాలను చెల్లించాలని ప్రశ్నించారు. డైలీ టెలిగ్రాఫ్, ద ఆస్ట్రేలియన్ లాంటి పత్రికల్లో తమ అసహనాన్ని వ్యక్తం చేశారు.

భార్యలు, భాగస్వాములు లేకుండానే ఆటగాళ్లను టూర్లకు పంపించాలని... అప్పుడైనా మెరుగైన ఆటను ఆడతారేమోనని క్రికెట్ అభిమానులు అంటున్నారు. ఉత్తపుణ్యానికే కోట్లు చెల్లించడం కంటే... పర్ఫామెన్స్ ఆధారంగా కాంట్రాక్టులను ఇవ్వాలని సూచించారు. చేసిన పరుగులు, తీసిన వికెట్ల ఆధారంగా వేతనాలు ఉండాలని అన్నారు.
australia cricket
australia cricket fans

More Telugu News