గిరిజన సలహా మండలి: గిరిజన సలహా మండలి జన్మభూమి కమిటీలా ఉంది: వైసీపీ నాయకుడు బాలరాజు
ఏపీ గిరిజన సలహా మండలి జన్మభూమి కమిటీలా ఉందంటూ వైసీపీ ఎస్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు తెల్లం బాలరాజు ఆరోపించారు. హైదరాబాద్ లోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఈ రోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ, గిరిజనులను ఏపీ సీఎం చంద్రబాబు మోసం చేస్తున్నారని, ఒక్క ఎస్టీ ఎమ్మెల్యేకు కూడా ఈ కమిటీలో స్థానం కల్పించలేదని ఆయన విమర్శించారు.
నాడు వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో గిరిజన సలహా మండలి ఏర్పాటు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా బాలరాజు ప్రస్తావించారు. నాటి గిరిజన సలహా మండలిలో అన్ని పార్టీల నేతలకు స్థానం కల్పించారని అన్నారు. కానీ, చంద్రబాబు మాత్రం ఏకపక్షంగా గిరిజన సలహా మండలిని నియమించారని, గిరిజనులకు ఇచ్చేందుకు చంద్రబాబు వద్ద నిధులు మాత్రం ఉండవని ఆయన మండిపడ్డారు.