4g: మరో మూడేళ్లలో 5జీ కూడా వచ్చేస్తోంది!

4జీ సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇంటర్నెట్ సేవల్లో వేగం పెరిగింది. మొబైల్ ఇంటర్నెట్ వాడకానికి 4జీ ఎంతో ఉపయోగపడుతోంది. తాజాగా 5జీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. 5జీ సేవలు ప్రపంచవ్యాప్తంగా 2020 కల్లా విస్తరించే అవకాశాలు ఉన్నాయి. ఇదే సమయంలో దానికి తగ్గట్టు సిద్ధం అయ్యేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు టెలికామ్ శాఖ మంత్రి మనోజ్ సిన్హా తెలిపారు. దీనికోసం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్టు ఆయన వెల్లడించారు.
4g
5g
5g services
5g services from 2020

More Telugu News