krishna: మా ఇంట్లోని థియేటర్ లోనే 'స్పైడర్' చూస్తా: సూపర్ స్టార్ కృష్ణ

  • బయటకు వెళ్లి సినిమాలు చూడటం లేదు
  • మహేష్ సినిమాలన్నీ రిలీజ్ రోజే చూస్తా
  • సినిమా హిట్టవుతుందన్న నమ్మకముంది: కృష్ణ
తాను ఇటీవలి కాలంలో బయట థియేటర్ లకు వెళ్లి సినిమాలు చూడటం లేదని, రేపు విడుదలయ్యే 'స్పైడర్' చిత్రాన్ని తన ఇంట్లోనే ఉన్న మినీ థియేటరులో చూడనున్నానని సూపర్ స్టార్ కృష్ణ వెల్లడించారు. మహేష్ సినిమాలన్నీ రిలీజ్ రోజునే చూస్తానని, ఆడియన్స్ చూసే రోజునే తానూ చూస్తానని స్పష్టం చేశారు.

 ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన, ఈ చిత్రం విజయవంతమవుతుందన్న నమ్మకం తనకుందని తెలిపారు. ముందు చూసి ఓ అభిప్రాయానికి వచ్చే బదులు, అందరూ చూసే సమయంలోనే చూడాలన్నది తన అభిమతమని వెల్లడించారు. మంచి టెక్నీషియన్స్ పని చేసిన సినిమా ఇదని, మంచి కథాంశంతో రూపుదిద్దుకుందని, అభిమానులు, ప్రేక్షకులు దీన్ని ఆదరిస్తారని, పెద్ద హిట్ అవుతుందని అన్నారు.
krishna
mahesh babu
spyder

More Telugu News