singareni elections: అంత సత్తా ఉన్నప్పుడు.. డబ్బు, మందు, విందులతో ఎందుకు ప్రలోభపెడుతున్నారు?: టీఆర్ఎస్ కు కోదండరామ్ సూటి ప్రశ్న

* టీఆర్ఎస్ నాటకాలు ఆడుతోంది

* ప్రభుత్వం చేస్తున్న మోసం సింగరేణి కార్మికులకు తెలుసు

* ఈ ఎన్నికలు ప్రభుత్వానికి చెంప పెట్టు కావాలి

టీఆర్ఎస్ నేతలపై టీజేఏసీ ఛైర్మన్ కోదండరామ్ మండిపడ్డారు. తెలంగాణలో తిరుగులేని పార్టీ టీఆర్ఎస్ అని చెప్పుకుంటున్న నేతలు... ప్రలోభాలకు ఎందుకు దిగుతున్నారని ఆయన ప్రశ్నించారు. నిజంగా టీఆర్ఎస్ కు అంత సత్తా ఉంటే సింగరేణి ఎన్నికల్లో డబ్బు, మద్యం, విందులతో ఎందుకు ప్రలోభపెడుతున్నారంటూ ఎద్దేవా చేశారు.

సింగరేణి కార్మికులపై తమకు నమ్మకం ఉందని... తమకు ఓట్లు వేసి విజయాన్ని కట్టిబెడతారని అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. వారసత్వ ఉద్యోగాల విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం నాటకాలు ఆడుతోందనే విషయం సింగరేణి కార్మికులందరికీ తెలుసని ఆయన అన్నారు. కార్మికుల తీర్పు టీఆర్ఎస్ ప్రభుత్వానికి చెంపపెట్టు కావాలని తెలిపారు.
singareni elections
kodandaram
tjac
TRS

More Telugu News