షిరిడీ అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్‌ను ఆవిష్కరించనున్న రాష్ట్రపతి
- ముంబై, హైద్రాబాద్‌లకు విమాన సర్వీసులు
- అలయన్స్ ఎయిర్‌తో ఒప్పందం చేసుకున్న ఎమ్ఏడీసీ
- అనంతరం సాయిబాబా మహా సమాధి శతాబ్ది వేడుకల్లో పాల్గొననున్న రామ్‌నాథ్
విమానాశ్రయానికి సంబంధించిన వాణిజ్య కార్యకలాపాలు కూడా అదే రోజు ప్రారంభించనున్నట్లు మహారాష్ట్ర ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పోరేషన్ (ఎమ్ఏడీసీ) ఎండీ సురేష్ కాకాని తెలిపారు. షిరిడీ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ నుంచి ముందుగా అలయన్స్ ఎయిర్ వారి భాగస్వామ్యంతో ముంబైకి నాలుగు విమానాలను నడపనున్నట్లు ఆయన చెప్పారు. అలాగే హైద్రాబాద్‌కి సర్వీసులను నడిపే యోచనలో ఉన్నట్లు ఆయన వివరించారు.