hani preet: హర్యానా, పంజాబ్ డ్రగ్ మాఫియా నన్ను వెంటాడుతోంది!: హనీప్రీత్

షార్ట్స్‌లో చూడండి
డేరా సచ్ఛాసౌధా మాజీ అధినేత గుర్మీత్ రాం రహీం సింగ్ ఎలాంటి తప్పు చేయలేదని ఆయన దత్త పుత్రిక హనీప్రీత్ ఇన్సాన్ తెలిపింది. ఢిల్లీలోని లాయర్ ను కలిసి బెయిల్ పిటిషన్ పై సంతకం చేసిన హనీప్రీత్ అందులో పలు విషయలు పేర్కొంది. గుర్మీత్ తనకు తండ్రి లాంటివాడని తెలిపింది. ఆయన ఎలాంటి తప్పు చేయలేదని హనీ ప్రీత్ అభిప్రాయపడింది.

తనను పంజాబ్, హర్యానా డ్రగ్ మాఫియాలు వెంటాడుతున్నాయని తెలిపింది. కాగా, పంచకుల న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలతో హర్యానా పోలీసులు ఆమె కోసం గాలింపు చేపట్టారు. ఢిల్లీలోని కైలాష్ పార్క్ పరిసరాల్లో గాలింపు జరుపుతున్నారు. ఆమె లాయర్ ప్రదీప్ ఆర్య ఇంటికి వచ్చిన కార్ల సీసీ పుటేజ్ ఆధారంగా ఐదు పోలీసు బృందాలతో గాలింపులు చేపట్టారు. 
Go Back to Shorts
hani preet
dera bab
hanipreet
delhi
police

More Telugu News