puri jagannadh: పూరీ దర్శకత్వంలో బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ మూవీ?
- వచ్చే ఏడాది హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న మోక్షజ్ఞ
- ఆ ప్రాజెక్టును పూరీకి అప్పగించే ఆలోచనలో బాలకృష్ణ
- పూరీతో సాన్నిహిత్యం .. ఆయన టాలెంట్ పై నమ్మకం
- ప్రస్తుతం తనయుడి సినిమా పనుల్లో పూరీ
ఇటీవల బాలకృష్ణ ఒక సందర్భంలో మాట్లాడుతూ, వచ్చే ఏడాది మోక్షజ్ఞ మూవీని లాంచ్ చేయనున్నట్టు చెప్పారు. ఆ సినిమా బాధ్యతను ఆయన పూరీ జగన్నాథ్ కి అప్పగించే ఆలోచనలో ఉన్నాడనేది తాజా సమాచారం. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ తన తనయుడితో ఒక సినిమాను తెరకెక్కించే పనిలో వున్నాడు.
ఆ ప్రాజెక్టు తరువాత ఆయన బాలకృష్ణ తనయుడి సినిమాను చేయనున్నట్టు ఫిల్మ్ నగర్లో ఒక వార్త షికారు చేస్తోంది. ఇందులో వాస్తవమెంతో గానీ .. ఇప్పుడిది హాట్ టాపిక్ గా మారిపోయింది. 'పైసా వసూల్' సినిమా సమయంలో పూరీ టేకింగ్ బాలకృష్ణకి బాగా నచ్చిందట. తనని ఆ సినిమాలో పూరీ చూపించిన తీరు కూడా ఆయన మనసు దోచుకుందని టాక్. ఈ కారణంగానే మోక్షజ్ఞ మొదటి సినిమా బాధ్యతను పూరీకి అప్పగించాలనే నిర్ణయానికి బాలకృష్ణ వచ్చాడని చెబుతున్నారు. చరణ్ ఫస్టు మూవీ కూడా పూరీనే చేశాడనే సంగతి తెలిసిందే.