sharwanand: షూటింగులో గాయపడినా లెక్కచేయని మెహ్రీన్!

షార్ట్స్‌లో చూడండి
'కృష్ణగాడి వీర ప్రేమగాధ'తో తెలుగు ప్రేక్షకుల మనసులు దోచేసిన మెహ్రీన్, వరుస సినిమాలతో వాళ్లను పలకరించడానికి సిద్ధమైపోతోంది. ఈ క్రమంలో ఆమె సినిమాలు వరుసగా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. వాటిలో 'మహానుభావుడు' సినిమా ఈ నెల 29వ తేదీన విడుదలవుతోంది.

 ఈ సినిమాలో 'కిస్ మీ బేబీ' అంటూ సాగే ఒక సాంగ్ ను 'క్రియేషియా'లో చిత్రీకరించారు. ఈ  పాటకు మెహ్రీన్ డాన్స్ చేస్తూ ప్రమాదవశాత్తు పడిపోయిందట. దాంతో ఆమె వీపుకు గాయమైంది. దగ్గర్లో హాస్పిటల్స్ కూడా ఏమీ లేకపోవడంతో యూనిట్ సభ్యులు ఆలోచనలో పడ్డారు. తన గురించి షూటింగ్ ఆపవద్దని చెప్పిన మెహ్రీన్, పెయిన్ కిల్లర్స్ వేసుకుని సాంగ్ చిత్రీకరణలో పాల్గొందట. బాధను భరిస్తూ ఈ పాట చిత్రీకరణలో పాల్గొన్న ఆమెను యూనిట్ సభ్యులు ఎంతగానో అభినందించారు. ఆమెకి గల అంకితభావాన్ని గురించి చెప్పుకొచ్చారు.    
Go Back to Shorts
sharwanand
mehreen

More Telugu News