జై లవ కుశ: అరవై ఏళ్ల వాళ్లు కూడా చప్పట్లు కొడుతున్నారు: ‘జై లవ కుశ’ దర్శకుడు బాబీ

  • ‘జై లవ కుశ’ సక్సెస్ మీట్ లో బాబీ
  • జూనియర్ ఎన్టీఆర్ నటన అద్భుతం
  • ‘జై’ పాత్ర రాగానే థియేటర్ లో క్లాప్స్ 
  • ‘రావణా..’ పాట అద్భుతం
‘జై లవ కుశ’ చిత్రంలో ‘జై’ పాత్ర రాగానే థియేటర్ లో ఉన్న మహిళలతో పాటు, యాభై, అరవై ఏళ్ల వాళ్లు కూడా చప్పట్లు కొడుతున్నారని ఈ చిత్ర దర్శకుడు బాబీ అన్నారు. ‘జై లవ కుశ’ సక్సెస్ మీట్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ నటన అద్భుతమని, మూడు పాత్రల్లో తారక్ అద్భుతంగా నటించారని అన్నారు. ఈ చిత్రానికి ప్రతి ఒక్కరూ బాగా కృషి చేశారని, దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన సంగీతాన్ని అందించాడని, చంద్రబోస్, రామజోగయ్య శాస్త్రి అద్భుతమైన పాటలు రాశారని ప్రశంసించారు.

ముఖ్యంగా చంద్రబోస్ రాసిన ‘రావణా..’ అనే పాట ప్రతి ఆటో రిక్షాలో మార్మోగిపోతోందని, అంత మంచి పాటను చాలా తక్కువ సమయంలో రాసిన చంద్రబోస్ కు తన కృతఙ్ఞతలు అని అన్నారు. ‘నా కంటే ముందు నా సినిమా మాట్లాడాలని వెయిట్ చేస్తూ ఉంటాను. ‘జై లవ కుశ’ తర్వాత కొత్త బాబీని చూస్తారు. ఈ సినిమా హిట్ తో నా కళ్లు పైకేమి ఎక్కవు’ అంటూ బాబీ చెప్పుకొచ్చారు.
జై లవ కుశ
బాబీ
జూనియర్ ఎన్టీఆర్

More Telugu News