mahesh babu: 'భరత్ అను నేను' షూటింగును కానిచ్చేస్తోన్న కొరటాల!

షార్ట్స్‌లో చూడండి
కొరటాల దర్శకత్వంలో 'భరత్ అను నేను' తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్  అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతోంది. కొన్ని రోజుల క్రితం వరకూ ఇక్కడ వేసిన 'అసెంబ్లీ' సెట్లో మహేశ్ కాంబినేషన్లోని సన్నివేశాలను చిత్రీకరించారు. 'స్పైడర్' సినిమా ప్రమోషన్స్ కి గాను మహేశ్ బ్రేక్ తీసుకోవడంతో, ఆయన పాత్ర ప్రమేయం లేని సన్నివేశాలను మిగతా ఆర్టిస్టులపై చిత్రీకరిస్తున్నారు.

 'స్పైడర్' ప్రమోషన్స్ పూర్తి కాగానే తిరిగి మహేశ్ 'భరత్ అను నేను' సినిమా షూటింగులో జాయిన్ కానున్నాడని అంటున్నారు. ఈ సినిమాను సంక్రాంతికి గానీ .. వేసవిలో గాని విడుదల చేసే ఆలోచనలో వున్నారు. ఈ సినిమా తరువాత వంశీ పైడిపల్లితో కలిసి మహేశ్ సెట్స్ పైకి వెళ్లనున్నాడు. ఆ తరువాత ఆయన చేసే సినిమా రాజమౌళి దర్శకత్వంలో వుండనుందనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఇందులో వాస్తవమెంతో చూడాలి మరి.      
Go Back to Shorts
mahesh babu

More Telugu News