అఖిలేశ్: నా తండ్రి ఎప్ప‌టికీ మాతోనే ఉంటారు: అఖిలేశ్‌ యాదవ్

  • కొత్త పార్టీని ఏర్పాటు చేయట్లేదు: ములాయం సింగ్
  • తండ్రీకొడుకుల మధ్య విభేదాలు ఎంతకాలం ఉంటాయో ఎవరూ చెప్పలేరు
  • నేతాజీ నా తండ్రి.. సమాజ్‌వాదీ పార్టీ ఆయనకే చెందుతుంది: అఖిలేశ్‌
  • నా తండ్రి ఆశీర్వాదాలతో పార్టీ మరింత ముందుకు
తన కుమారుడితో విభేదాలు వచ్చిన నేపథ్యంలో తాను కొత్త పార్టీని ఏమీ ఏర్పాటు చేయట్లేదని సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్‌ యాదవ్ అన్నారు. తండ్రీకొడుకుల మధ్య విభేదాలు ఎంతకాలం ఉంటాయో ఎవరూ చెప్పలేరని ఆయ‌న పేర్కొన్నారు. త‌న కుమారుడు అఖిలేశ్‌కి త‌న‌ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని చెప్పారు. కానీ, అఖిలేశ్‌ తీసుకునే నిర్ణయాలతో మాత్రం తాను ఏకీభవించబోన‌ని వ్యాఖ్యానించారు.

ములాయం వ్యాఖ్య‌ల‌పై స్పందించిన‌ అఖిలేశ్‌ యాదవ్‌..  నేతాజీ త‌న‌ తండ్రి అని, సమాజ్‌వాదీ పార్టీ ఆయనకే చెందుతుందని త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పేర్కొన్నారు. త‌న తండ్రి ఎప్ప‌టికీ త‌మ‌తోనే ఉంటార‌ని చెప్పారు. త‌న తండ్రి ఆశీర్వాదాలతో త‌మ‌ పార్టీని మరింత ముందుకు తీసుకెళ్తామ‌ని అన్నారు. 
అఖిలేశ్

More Telugu News