'రంగస్థలం 1985'లో కరీనా కపూర్ స్పెషల్ సాంగ్?
- చాలావరకూ షూటింగ్ పూర్తి చేసుకున్న 'రంగస్థలం'
- మాస్ ను ఊపేసే స్పెషల్ సాంగ్
- కరీనా కపూర్ తో సంప్రదింపులు
- త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ
గ్రామీణ నేపథ్యంలో సాగే కథ కనుక, మాంచి మాస్ మసాలాతో కూడిన ఒక స్పెషల్ సాంగ్ ను రెడీ చేశారట. ఈ సాంగ్ ను కరీనా కపూర్ తో గానీ, ప్రియాంక చోప్రాతో గాని చేయిస్తే కొత్తగా ఉంటుందని భావించారట. ఈ విషయంపై వాళ్లను సంప్రదించినట్టుగా కూడా చెప్పుకుంటున్నారు. కరీనా కపూర్ తో చేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని అంటున్నారు. ఈ ప్రచారంలో వాస్తవమెంతో గానీ, ఇప్పుడిదే హాట్ టాపిక్ గా మారిపోయింది.