ఇటలీలో ఎయిర్ షో జరుగుతుండగా ప్రమాదం... పైలెట్ మృతి... వైరల్ అవుతున్న వీడియో
- ఇటలీలో జరిగిన ఎయిర్ షో
- సముద్రంలో కుప్పకూలిన జెట్ విమానం
- కళ్లముందే పైలెట్ మృతి
చివరగా `ఫ్రెచ్చె టెర్రాచినా` అనే విన్యాసం ప్రదర్శిస్తుండగా అదుపు తప్పి సముద్రంలో పడిపోయింది. వెంటనే సహాయక చర్యలు చేపట్టినప్పటికీ విమానం ఆచూకీని గుర్తించడంలో కొద్దిగా ఆలస్యం జరిగింది. దీంతో పైలెట్ మృతదేహాన్ని మాత్రమే అధికారులు వెలికితీయగలిగారు. అయితే ప్రమాదం జరగడానికి స్పష్టమైన కారణాలు ఇటాలియన్ ఎయిర్‌ఫోర్స్ అంచనా వేయలేకపోతోంది. దీనిపై విచారణ చేపడుతున్నట్లు అధికారులు ప్రకటించారు.