akshara hassan: కమల్ వెంటే అక్షర హాసన్!

  • రాజకీయాల దిశగా కమల్
  •  అభిమానుల అండదండలు
  •  తండ్రి వెంట నడవడానికి సిద్ధంగా అక్షర హాసన్
  •  తండ్రి కోసమే పూర్తి సమయం  
కమల్ కూతురు శ్రుతి హాసన్ కథానాయికగా తెలుగు .. తమిళ .. హిందీ భాషల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. దాంతో శ్రుతి హాసన్ చెల్లెలు అక్షర హాసన్ కూడా రంగంలోకి దిగింది. ఇప్పుడిప్పుడే ఈ అమ్మాయి కథానాయికగా నిలదొక్కుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఇక ఆమె తన పూర్తి సమయాన్ని రాజకీయాలకి కేటాయించనున్నట్టు తెలుస్తోంది.

 కమల్ రాజకీయాల్లోకి రావడానికి సిద్ధమవుతున్నాడు. రేపో మాపో కొత్త పార్టీని ప్రకటించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఆయన ఆ దిశగా అభిమానులను నడిపించే ప్రయత్నాలు మొదలెట్టినట్టు చెప్పుకుంటున్నారు. అయితే రాజకీయాల్లో తండ్రికి సహాయ సహకారాలను అందించాలని అక్షర హాసన్ నిర్ణయించుకుందట. తండ్రి ఆదేశాలను టీమ్ కి చేరవేయడంలోను .. సామాజిక అంశాలకి సంబంధించిన స్క్రిప్ట్ లను సిద్ధం చేయడంలోను ఆమె యాక్టివ్ గా వుండనున్నట్టు చెబుతున్నారు. 
akshara hassan

More Telugu News