pv sindhu: పద్మ‌భూష‌ణ్‌కు పీవీ సింధు పేరును సిఫార‌సు చేసిన క్రీడాశాఖ‌

బ్యాడ్మింట‌న్ క్రీడాకారిణి, ఒలింపిక్ గ్ర‌హీత‌, తెలుగు తేజం పీవీ సింధుకు మ‌రో గౌర‌వం ద‌క్కే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఆమె పేరును ప్ర‌తిష్టాత్మ‌క ప‌ద్మ‌భూష‌ణ్ అవార్డుకు క్రీడాశాఖ సిఫార్సు చేసింది. ప్ర‌స్తుతం ప్ర‌పంచ నెం. 2 ర్యాంకులో కొన‌సాగుతున్న‌ సింధు బ్యాడ్మింట‌న్‌లో వివిధ అంత‌ర్జాతీయ టోర్నీల్లో అత్యుత్తమ ప్ర‌తిభ క‌న‌బ‌రుస్తున్న సంగ‌తి తెలిసిందే. క్రీడాశాఖ చేసిన సిఫార్సును ప్ర‌స్తుతం హోం శాఖ ప‌రిశీలిస్తుంది. ఇటీవ‌ల క్రికెట‌ర్ మ‌హేంద్ర సింగ్ ధోనీ పేరును బీసీసీఐ సిఫారసు చేసిన సంగ‌తి విదిత‌మే.
pv sindhu
padma bhushan
sports ministry
nomination

More Telugu News