mahesh babu: మహేశ్ బాబు బాలీవుడ్ మూవీ ఎందుకు చేయడం లేదు.. హిందీ రాకా?

షార్ట్స్‌లో చూడండి
ప్రస్తుతం మహేశ్ బాబు 'స్పైడర్' సినిమా ప్రమోషన్స్ లో బిజీగా వున్నాడు. ఈ నేపథ్యంలోనే హిందీ నుంచి ఆఫర్లు వస్తున్నా అక్కడి సినిమాలు చేయకపోవడానికి కారణం, హిందీ రాకపోవడమేనా? అనే ప్రశ్న ఆయనకి ఎదురైంది. దాంతో ఆయన తనదైన శైలిలో స్పందించాడు.

తనకి తమిళం బాగా వచ్చినా అక్కడి సినిమా చేయడానికి ఇంతకాలం పట్టిందని మహేశ్ అన్నాడు. మురుగదాస్ చెప్పిన కథ నచ్చడం వలన తాను 'స్పైడర్' ద్వారా కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధపడ్డానని చెప్పాడు. ఇక తాను హిందీ కూడా బాగా మాట్లాడతాననీ, కాకపోతే ఆ విషయం చాలామందికి తెలియదని అన్నాడు. హిందీ నుంచి మంచి కథతో ఎవరైనా వస్తే చేయడానికి తనకి ఎలాంటి అభ్యంతరం లేదనీ .. తాను సిద్ధంగానే వున్నానని చెప్పాడు. తాను తెలుగులో బిజీగా ఉండటం కూడా హిందీలో చేయకపోవడానికి మరో కారణమని అన్నాడు.
Go Back to Shorts
mahesh babu

More Telugu News