kan: మా డ్రైవరే లేకుంటే నా డెడ్ బాడీ పరకాల ఆసుపత్రిలో ఉండేది!: కంచె ఐలయ్య

  • నన్ను హత్య చేయాలని చూశారు
  • కాపాడిన పోలీసులకు కృతజ్ఞతలు
  • మనుధర్మాన్ని నిషేధిస్తారా?
  • ప్రొఫెసర్ కంచె ఐలయ్య
పరకాల పట్టణంలో తనను అడ్డుకున్న కొందరు, హత్య చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించారని, ప్రొఫెసర్ కంచె ఐలయ్య ఆరోపించారు. ఆ సమయంలో తన డ్రైవర్ చాలా అప్రమత్తతతో వ్యవహరించాడని, అతనే లేకుంటే తన మృతదేహం పరకాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఉండేదని ఆయన అన్నారు. ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. పరకాలలో తన ప్రాణాలకు ముప్పు ఉందని అర్థమైన తరువాత, పోలీసుల సహకారాన్ని కోరుతూ స్టేషన్ కు తాను వెళితే, కొందరు అక్కడికి కూడా వచ్చి తనపై దాడికి దిగారని ఆరోపించారు. ఆ సమయంలో తన ప్రాణాలు కాపాడిన పోలీసులకు కృతజ్ఞతలని అన్నారు.

తన పుస్తకాన్ని విత్ డ్రా చేసుకోవాలని వస్తున్న డిమాండ్ పై స్పందిస్తూ, ఆ పని చేసే అవకాశమే లేదని అన్నారు. మనుధర్మంలో దళిత కులాల ప్రస్తావన ఉందని, వారిపై ఎన్నో ఆంక్షలు ఉన్నాయని, దాన్ని కూడా బ్యాన్ చేయాలని అడుగుతారా? అని ప్రశ్నించారు. మీడియా తనను దబాయించాలని చూస్తే తాను ఊరుకోబోనని అన్నారు. ఏ వర్గాన్నీ టార్గెట్ చేయరాదంటూ రాజ్యాంగం కల్పించిన హక్కులను ప్రస్తావించగా, తమ కులాలు వేల ఏళ్లుగా అణగదొక్కబడ్డాయని, తొక్కేస్తుంటే ప్రశ్నించకూడదా? అని ఐలయ్య అడిగారు. స్వేచ్ఛా, సమానత్వం, సౌభ్రాతృత్వం కనిపించకనే తాను రచనలు సాగిస్తున్నానని స్పష్టం చేశారు. తనను హత్య చేయడానికి ఎంతో మంది ప్రయత్నిస్తున్నారని ఆరోపించిన ఆయన, ఈ విషయంలో పోలీసులకూ ఫిర్యాదు చేశానని చెప్పారు.
kan

More Telugu News