Dhoni: ధోనీ, రాహుల్ ద్రవిడ్ రికార్డులను సమం చేసిన కోహ్లీ!

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు చేరింది. వరుసగా అత్యధిక వన్డేల్లో జట్టును గెలిపించిన సారథిగా మాజీ సారథులు ధోనీ, ద్రవిడ్‌ల సరసన చేరాడు. ధోనీ సారథ్యంలోని టీమిండియా నవంబరు 14, 2008 నుంచి ఫిబ్రవరి 5, 2009 వరకు వరుసగా 9 వన్డేల్లో విజయం సాధించింది. 2006లో జట్టుకు సారథిగా ఉన్న ద్రవిడ్ కూడా వరుసగా 9 మ్యాచుల్లో జట్టును గెలిపించాడు. ఇక ఇప్పుడు కోహ్లీ కెప్టెన్సీలోని జట్టు కూడా ఆ ఘనత సాధించింది. జూలై 6, 2017 నుంచి సెప్టెంబరు 24, 2017 వరకు వరుసగా 9 వన్డేల్లో జయ కేతనం ఎగురవేసింది.
ఆదివారం ఇండోర్‌లో ఆసీస్‌తో జరిగిన మూడో వన్డేలో 5 వికెట్ల తేడాతో విజయం సాధించిన భారత్ సిరీస్‌ను కైవసం చేసుకోవడమే కాకుండా వన్డే ర్యాంకింగ్స్‌లో నంబరు వన్‌ స్థానానికి చేరుకుంది.
Dhoni
Rahul dravid
virat kohli
one-day

More Telugu News