వైసీపీ గ్రేటర్ హైదరాబాదర్: రోడ్డు ప్రమాదంలో వైసీపీ గ్రేటర్ హైదరాబాద్ జనరల్ సెక్రటరీ మృతి
- వైసీపీ గ్రేటర్ హైదరాబాద్ జనరల్ సెక్రటరీ మీర్జా ఆజం అలీ దుర్మరణం
- స్తంభాన్ని ఢీ కొట్టిన ఆయన కారు
- మరో ఐదుగురికి గాయాలు
రోడ్డు ప్రమాదంలో వైసీపీ గ్రేటర్ హైదరాబాద్ జనరల్ సెక్రటరీ మీర్జా ఆజం అలీ మృతి చెందారు. మహబూబ్ నగర్ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా శంషాబాద్ ఎయిర్ పోర్టు రోడ్డుపై ఆయన ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి పక్కనే ఉన్న ఓ స్తంభాన్ని ఢీ కొట్టింది. ఈ సంఘటనలో మీర్జా ఆజం అలీ అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఐదుగురికి స్వల్ప గాయాలయ్యాయి. ఆయన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కాగా, ఆయన మృతిపై వైసీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి సంతాపం తెలిపారు.