honeypreet: నేనెక్కడ గుర్మీత్ కు దగ్గరై పెళ్లి చేసుకుంటానోనని హనీప్రీత్ కు భయం: రాఖీ సావంత్ సంచలన వ్యాఖ్య

  • గుర్మీత్ ను కలవాలని చూస్తే అడ్డుపడింది
  • నేనెక్కడ సవతిగా మారతానోనని ఆమెకు భయం
  • ఓ ఇంటర్వ్యూలో రాఖీ సావంత్
డేరా సచ్ఛా సౌధ చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ వివాదాస్పద జీవితంపై నిర్మిస్తున్న బాలీవుడ్ చిత్రంలో హనీప్రీత్ పాత్రను పోషిస్తున్న హాట్ బాంబ్ రాఖీ సావంత్, సంచలన వ్యాఖ్యలు చేసింది. జీ రీజనల్ న్యూస్ నెట్ వర్క్ లో వచ్చే 'ఏ డైలాగ్ విత్ జేసీ' షోలో పాల్గొన్న ఆమె, తాను గుర్మీత్ కు దగ్గర కావాలని ప్రయత్నించినప్పుడెల్లా, హనీప్రీత్ అడ్డుపడిందని ఆరోపించింది. తాను ఆయనకు దగ్గరైతే, ఎక్కడ తనను పెళ్లి చేసుకుంటాడో అన్న భయం ఆమెను వెంటాడిందని, అందువల్ల తనను గుర్మీత్ తో కలవనిచ్చేది కాదని తెలిపింది.

గుర్మీత్ పుట్టిన రోజున తనకు ఆహ్వానం అందితే వెళ్లానని, డేరాలో ఉన్న గుర్మీత్ నివాసం గుఫా (గుహ)లోకి వెళ్లానని, నన్ను చూడగానే హనీప్రీత్ అసహనంగా చూసిందని, అతన్ని పెళ్లి చేసుకుని ఎక్కడ సవతిగా మారతానోనని భయపడిందని చెప్పింది. ఆడవారిపట్ల గుర్మీత్ ఎలా ఉంటాడోనన్న విషయం తనకు తెలియదని చెప్పింది. అమ్మాయిల నడుమ రాక్ స్టార్ లా కనిపించిన గుర్మీత్ ను చూసి తాను ఆశ్చర్యపోయానంది. ఇక తన బాలీవుడ్ రంగ ప్రవేశం వెనుక ఎంతో కష్టముందని, షారూఖ్ ఖాన్, నృత్య దర్శకురాలు ఫరా ఖాన్ లు తనకెంతో అండగా నిలిచారని చెప్పుకొచ్చింది రాఖీ సావంత్.
honeypreet
dera
gurmeet
rakhi sawant

More Telugu News