ప్రవాస భారతీయుడు: తిరుమల శ్రీవారికి 30 కిలోల బంగారు ఆభరణాలు అందజేసిన ప్రవాస భారతీయుడు
ఈ రోజు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వేంకటేశ్వరుడికి ఎం.రామలింగరాజు అనే ప్రవాస భారతీయుడు 30 కిలోల బంగారు ఆభరణాలు కానుకగా అందజేశారు. మొత్తం 11 కోట్ల రూపాయలతో శ్రీవారికి సహస్రనామ కాసులహారం చేయించిన ఆయన.. ఈ రోజు తిరుమలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టువస్త్రాలు సమర్పించిన అనంతరం.. సీఎం చేతుల మీదుగా ఆ కాసుల హారాన్ని టీటీడీ అధికారులకు అందించారు. తరువాత తిరుమల శ్రీవారి పెదశేషవాహన సేవ ప్రారంభమైంది.