స్వామి పరిపూర్ణానంద: ఐలయ్యా.. నీకు చదువు చెప్పింది నీ కులం వారేనా?: స్వామి పరిపూర్ణానంద సూటి ప్రశ్న
- ఎన్నో కులాలకు చెందిన గురువుల దగ్గర విద్య నేర్చుకున్నాడు
- వాళ్ల మీదే ఇలాంటి రాతలు రాస్తున్నాడు
- గో సేవ చేస్తా.. అది నాకు భగవంతుడు ఇచ్చిన వరం
- గోవు పేడ ఎత్తుతా, దానికి ఆహారం పెడతా, ప్రతి రోజు దాన్ని పూజిస్తా
- ఆవును పెంచి, చంపేసి తినడం ఐలయ్య పని
ప్రొ.కంచ ఐలయ్యకు చదువు చెప్పింది ఆయన కులం వారేనా? అని శ్రీపీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద ప్రశ్నించారు. ఎన్నో కులాలకు చెందిన గురువుల దగ్గర విద్య నేర్చుకుని, ఈ రోజు ఆయన వాళ్లనే తుంగలో తొక్కుతున్నాడని అన్నారు. ‘సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు’ అంటూ పుస్తకం రాసిన కంచ ఐలయ్యపై ఆర్యవైశ్యులు మండిపడుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్వామి పరిపూర్ణానంద ఓ టీవీ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కంచ ఐలయ్యపై మండిపడ్డారు.
తాను గో సేవ చేస్తానని, అది తనకు భగవంతుడు ఇచ్చిన వరమని స్వామి పరిపూర్ణానంద అన్నారు. గోవుకు కాపలాకాయడం మాత్రమేకాదని, గోవు పేడ ఎత్తుతానని, దానికి ఆహారం పెడతానని, ప్రతి రోజు దాన్ని పూజిస్తానని, ఇది తన నీతి అని చెప్పారు. ఆవును పెంచి, చంపేసి తినడం తన పని కాదని, అటువంటివి ఐలయ్య చేస్తాడని ఎద్దేవా చేశారు.