కుల్‌దీప్: క్రికెట్‌ చూడటం కంటే ఫుట్‌బాల్‌ చూసేందుకే ఎక్కువ ఇష్టపడతా: కుల్‌దీప్

  • టేబుల్‌ టెన్నిస్‌ ఆడటం, సినిమాలు చూడడం అంటే కూడా ఇష్టమే
  • ఎఫ్‌సీ బార్సిలోనా ఫుట్‌బాల్‌ జట్టు అంటే మ‌హా ఇష్ట‌ం
తాను ఖాళీ సమయాల్లో క్రికెట్‌ చూడటం కంటే ఫుట్‌బాల్‌ చూసేందుకే ఎక్కువ ఇష్టపడతాన‌ని టీమిండియా కొత్త బౌలర్ కుల్‌దీప్ యాదవ్ అన్నాడు. కోల్‌క‌తాలోని ఈడెన్‌గార్డెన్స్‌లో జరిగిన రెండో వన్డేలో వికెట్లు తీయడంలో హ్యాట్రిక్ సాధించిన కుల్‌దీప్‌.. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ... త‌న‌కు క్రికెట్‌ కంటే ఫుట్‌బాల్‌ అంటేనే ఎక్కువ ఇష్ట‌మ‌ని చెప్పాడు. త‌న‌కు ఫుట్‌బాల్‌, క్రికెటే కాకుండా టేబుల్‌ టెన్నిస్‌ ఆడటం, సినిమాలు చూడడం అంటే కూడా ఇష్టమేన‌ని చెప్పాడు. త‌న‌కు ఎఫ్‌సీ బార్సిలోనా ఫుట్‌బాల్‌ జట్టు అంటే మ‌హా ఇష్ట‌మ‌ని తెలిపాడు. కాగా, ఆస్ట్రేలియాతో టీమిండియా రేపు మూడో వన్డే ఆడ‌నుంది.  
కుల్‌దీప్

More Telugu News