nara rohith: న్యూ లుక్ తో 'బాలకృష్ణుడు'గా నారా రోహిత్ అదరగొట్టేశాడు!

  •  నారా రోహిత్ హీరోగా 'బాలకృష్ణుడు'
  •  స్టైలీష్ లుక్ తో న్యూ పోస్టర్ రిలీజ్ 
  •  సిక్స్ ప్యాక్ తో కనిపించనున్న నారా రోహిత్
  •  అక్టోబర్ నెలాఖరులో విడుదల  
ఎప్పటికప్పుడు కొత్తదనంతో కూడిన కథలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి నారా రోహిత్ ప్రయత్నం చేస్తూనే వున్నాడు. ఇటీవల వచ్చిన 'శమంతకమణి' .. 'కథలో రాజకుమారి' ఆయన అభిమానులను నిరాశ పరిచాయి. దాంతో తన తదుపరి సినిమా 'బాలకృష్ణుడు'ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తున్నాడు.

 పవన్ మల్లెల దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి తాజాగా నారా రోహిత్ న్యూ పోస్టర్ ను రిలీజ్ చేశారు. కాస్త సన్నబడి స్టైలీష్ గా .. మరింత హ్యాండ్సమ్ గా ఈ పోస్టర్లో నారా రోహిత్ కనిపిస్తున్నాడు. ఇంత స్టైలిష్ గా ఆయన కనిపించడం ఇదే మొదటిసారి అని చెప్పొచ్చు. నారా రోహిత్ సిక్స్ ప్యాక్ తో కనిపించనున్న ఈ సినిమాలో రెజీనా కథానాయిక. మణిశర్మ సంగీతాన్ని అందించిన ఈ సినిమాను అక్టోబర్ చివర్లో విడుదల చేయనున్నారు.

   
nara rohith
regina

More Telugu News