రోజురోజుకీ పెరుగుతున్న డొమైన్ రిజిస్ట్రేషన్లు... 331 మిలియన్లకు చేరుకున్న డొమైన్లు
- డాట్ కామ్, డాట్ నెట్లకే ప్రథమ ప్రాధాన్యం
- సంవత్సరానికి 2.1 శాతం పెరుగుతున్న రిజిస్ట్రేషన్లు
- డొమైన్ కేటాయింపు కంపెనీ వెరిసైన్ నివేదికలో వెల్లడి
సంవత్సరానికి 2.1 శాతం చొప్పున డొమైన్ రిజిస్ట్రేషన్లు పెరుగుతున్నట్లు కంపెనీ పేర్కొంది. వీటిలో ముఖ్యంగా డాట్ కామ్, డాట్ నెట్ డొమైన్లకే ఎక్కువ మంది ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపింది. జూన్ 30, 2017 నాటికి డాట్ కామ్, డాట్ నెట్ డొమైన్ల రిజిస్ట్రేషన్లు 144.3 మిలియన్లు ఉన్నట్లు వెరిసైన్ పేర్కొంది. ఇందులో డాట్ కామ్ డొమైన్ రిజిస్ట్రేషన్లు 129.2 మిలియన్లు కాగా, డాట్ నెట్ రిజిస్ట్రేషన్లు 15.1 మిలియన్లు ఉన్నట్లు తెలిపింది.