doubt: అతను తండ్రి కాదు.. కిరాతకుడు.. అనుమానంతో అఘాయిత్యం!

షార్ట్స్‌లో చూడండి
భార్యపై అనుమానంతో.. కూతురిపై అత్యాచారానికి పాల్పడి.. ఆ తర్వాత ఉరి వేసి చంపిన మానవ మృగాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే... మధ్యప్రదేశ్ లోని భోపాల్ శివార్లలో బేరేలా గ్రామానికి చెందిన బాలిక ఫ్యానుకి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని ఫోన్ రావడంతో అక్కడికి పోలీసులు చేరుకున్నారు. ఆరేళ్ల బాలిక ఫ్యాన్ కి ఎలా ఉరి వేసుకుందో అర్ధం కాని పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, పోస్టు మార్టంకి తరలించే ప్రయత్నం చేశారు.

అయితే, బాలిక తండ్రి ఆ ప్రయత్నాన్ని తీవ్రంగా అడ్డుకున్నాడు. దీంతో అతని వ్యవహారంపై పోలీసులకు అనుమానం వచ్చింది. వెంటనే పోస్టు మార్టంకి పంపించారు. పోస్టు మార్టం రిపోర్టులో బాలికపై అత్యాచారం జరిగిందని, బాలిక శరీరంపై లభ్యమైన వీర్యం డీఎన్ఏతో తండ్రి వీర్యనమూనా సరిపోయిందని తేలింది. దీంతో పోలీసులు తమదైన శైలిలో అతనిని విచారించగా, తన భార్య వివాహేతర సంబంధం వల్ల ఆ పాప పుట్టిందని, అందుకే, తన భార్యను షాపింగ్ కు పంపి, బాలికను హతమార్చానని అంగీకరించాడు. దీంతో అతనిని కటకటాల వెనక్కి పంపించారు. 
Go Back to Shorts
doubt
doubted father
daughter rape
murder

More Telugu News