రేణూ దేశాయ్: థ్యాంక్యూ సో మచ్.. మంచి స్పందన వచ్చింది: రేణూ దేశాయ్
స్టార్ మా టీవీలో ప్రసారం కానున్న ‘నీతోనే డ్యాన్స్’ షోలో రేణూ దేశాయ్ జడ్జిగా వ్యవహరించనున్న విషయం తెలిసిందే. ఈ షోకి సంబంధించిన ప్రోమోను నిన్న విడుదల చేశారు. దీనికి మంచి స్పందన వచ్చిందని, టీవీ షోలో జడ్జిగా మొదలు పెట్టిన తన కొత్త ప్రయాణానికి బెస్ట్ విషెస్ చెప్పిన అభిమానులకు చాలా కృతజ్ఞతలని ఆమె ట్విట్టర్ లో పేర్కొంది.
ఇక ఈ షో ఈ నెల 30 నుంచి ప్రారంభం కానుందని తెలిపింది. ఈ ప్రోమోలో వినిపించింది తన వాయిస్ కాదని, ఈ షో షూటింగ్ లో బిజీగా ఉండడంతో తనకు వాయిస్ డబ్బింగ్ చెప్పే సమయం దొరకలేదని పేర్కొంది. టీవీ షోలో మాత్రం తన వాయిసే వినవచ్చని తెలిపింది.