కమలహాసన్‌: సినీనటుడు కమలహాసన్‌ను క‌లిసిన ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్

చెన్నైలో సినీనటుడు కమలహాసన్‌ను ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ కలిశారు. వారిద్దరు ఏయే అంశాల‌పై చ‌ర్చిస్తున్నార‌న్న విష‌యం తెలియాల్సి ఉంది. క‌మ‌ల‌హాస‌న్ ఇంట్లోనే ఈ స‌మావేశం జ‌రుగుతోంది. కేజ్రీవాల్‌, క‌మల్ ఢిల్లీలో 2005లోనూ క‌లుసుకున్నారు. షూటింగ్ ప‌నిమీద అక్క‌డ‌కు వెళ్లిన క‌మ‌ల్ ఆ స‌మ‌యంలో కేజ్రీవాల్‌ను క‌లిసి ప‌లు అంశాల‌పై చర్చించారు.

ఇప్పుడు రాజ‌కీయాల్లోకి వ‌స్తాన‌ని ప్ర‌క‌టించిన క‌మ‌ల్‌ను కేజ్రీవాల్ స్వ‌యంగా క‌ల‌వ‌డంతో ఆయ‌న ఆప్‌లో చేర‌తారా? అన్న ప్ర‌శ్న త‌లెత్తుతోంది. ఇటీవ‌ల కేర‌ళ ముఖ్య‌మంత్రి పిన‌ర‌యి విజ‌య‌న్‌ను క‌లిసిన క‌మ‌ల్.. తాను మ‌రికొంత మంది ముఖ్య‌మంత్రుల‌ను కూడా క‌లుస్తాన‌ని అప్ప‌ట్లో అన్నారు. 
కమలహాసన్‌
అర‌వింద్ కేజ్రీవాల్

More Telugu News