gio: జియో ఫోన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి బ్యాడ్ న్యూస్

  • ఫోన్ల డెలివరీ డేట్ వాయిదా
  • ప్రకటన ప్రకారం నేటి నుంచి డెలివరీ కావాలి
  • భారీ బుకింగ్స్ కారణంగా వాయిదా
జియో ఫోన్ల కోసం ఎదురు చూస్తున్న కస్టమర్లకు నిరాశ ఎదురైంది. రిలయన్స్ ప్రకటన మేరకు ఈరోజు నుంచి జియో ఫోన్ల డెలివరీ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ, డెలివరీ స్టార్ట్ కాలేదు. డెలివరీ డేట్ ను అక్టోబర్ 1కి వాయిదా వేసినట్టు తెలుస్తోంది. ఆగస్ట్ 24 నుంచి జియో ఫోన్ ప్రీబుకింగ్స్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ ఫోన్లకు భారీ ఎత్తున స్పందన రావడంతో, గంటల్లోనే ప్రీబుకింగ్స్ ను జియో నిలిపివేసింది. భారీ ఎత్తున బుకింగ్స్ రావడంతోనే డెలివరీ డేట్ వాయిదా పడినట్టు తెలుస్తోంది. లక్షలాది మంది ఈ ఫోన్లను బుక్ చేసుకున్నారు. ఈ సందర్భంగా ఓ రీటైలర్ మాట్లాడుతూ, ఫోన్ల డెలివరీని అక్టోబర్ 1కి వాయిదా వేసినట్టు తనకు జియో నుంచి మెసేజ్ వచ్చిందని తెలిపాడు.
gio
gio phone
gio phone delivery
gio phone delivery date
gio phone delivery date postponed

More Telugu News