రోహింగ్యా ముస్లింలను తిప్పి పంపించేస్తాం.. వారివల్ల దేశానికి ముప్పు: రాజ్ నాథ్
- రోహింగ్యాలు శరణార్థులు కాదు
- ఆశ్రయం కోరి మన దేశంలోకి రాలేదు
- వారితో దేశ భద్రతకు ముప్పు
- కొందరి అభ్యంతరాలను పట్టించుకోం
- మయన్మార్ కు తిప్పి పంపించేస్తాం
ఎవరైనా శరణార్థిగా దేశంలో ప్రవేశించాలంటే ఓ ప్రక్రియ ఉంటుందని, రోహింగ్యాలు ఆ ప్రక్రియను పాటించలేదని రాజ్ నాథ్ తెలిపారు. 1951 ఐక్యరాజ్యసమితి శరణార్థి ఒప్పందంలో భారత్ చేరలేదని... ఈ నేపథ్యంలో, రోహింగ్యాలను మయన్మార్ కు తిప్పి పంపడం ద్వారా భారత్ ఎలాంటి అంతర్జాతీయ ఒప్పందాలను ఉల్లంఘించడం లేదని అన్నారు. మరోవైపు, రోహింగ్యాలు దేశ భద్రతకు ముప్పుగా మారారని, ఈ కారణం వల్లే వారిని మయన్మార్ కు తిప్పి పంపించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు సుప్రీంకోర్టుకు కేంద్ర హోం శాఖ సమర్పించిన అఫిడవిట్ లో పేర్కొన్నారు.